Allari Naresh : అల్లరి నరేశ్ కు అప్పట్లో మంచి మార్కెట్ ఉండేది. కానీ కామెడీ సినిమాలు తగ్గించి సీరియస్ సినిమాలు మొదలెట్టినప్పటి నుంచే ఆయనకు డిమాండ్ తగ్గిపోయింది. ఎంచుకుంటున్న కథలు హిట్ కాకపోవడం ఆయన మార్కెట్ ను దెబ్బ తీసింది. ఇలాంటి టైమ్ లో ఆయన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నారు. అది కూడా పాములకు భయపడి. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు కార్తికేయ. నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. అయితే ఈ కథను ముందుగా నరేశ్ కు చెప్పాడంట చందు. కానీ ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చుట్టూ కథ ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టూ పాములు ఉండటం ఇందులో కీలకం.
Read Also : Shilpa Shetty : పోలీసుల ముందు విచారణకు హాజరైన స్టార్ హీరోయిన్
అయితే వ్యక్తిగతంగా నరేశ్ కు పాములంటే భయం. అందుకే ఈ సినిమా కథను వద్దనుకున్నాడంట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు నరేశ్. నరేశ్ ఇలా వద్దనడంతో చేసేది లేక అదే కథను నిఖిల్ కు చెప్పడం.. అతను కూడా వెంటనే ఒప్పేసుకోవడం జరిగిపోయాయి. రిజల్ట్ ఏంటో మనం చూశాం. అది పాన్ ఇండియా మూవీ సిరీస్ గా మారి.. నిఖిల్ కు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఒకవేళ అదే కథ నరేశ్ చేసి ఉంటే అతని కెరీర్ కు మంచి బూస్ట్ అయి ఉండేది. కానీ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు నరేశ్. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఆయన ఈ మధ్య ఎక్కువగా హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : MithraMandali : ‘మిత్ర మండలి’ ట్రైలర్ రిలీజ్.. ఎవడ్రా ఈ సుబ్బారావు?