వైరల్ పిక్ : జడేజా ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ ఫైర్ ఇంకా తగ్గనేలేదు. ఓటిటిలో విడుదలైనప్పటికీ తగ్గేదే లే అంటూ ‘పుష్ప’రాజ్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మాయలో పడుతున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిందో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా ‘పుష్ప’ ట్రెండ్ సెట్ చేస్తోంది. ‘తగ్గేదే లే… పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?… ఫైరూ…” ఈ రెండు డైలాగులు ఇప్పటికీ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

Read Also : మరో స్టార్ కపుల్ బ్రేకప్… నీచం అంటూ హీరో కౌంటర్

తాజాగా ‘పుష్ప’ ఫైర్ క్రికెటర్లను కూడా తాకినట్లు అన్పిస్తోంది. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్ప రాజ్‌గా మారిపోయాడు. జడేజా మొత్తం ‘పుష్ప’ లుక్ లోకి మారిపోయిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ లో బీడీ తాగుతూ కన్పించిన జడేజా “పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా… ఫైరూ” అని ట్వీట్ చేశాడు. ఈ ఫోటో ఆయన పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. అయితే ఒక క్రికెటర్‌గా జడేజా పొగాకు వాడకానికి వ్యతిరేకంగా హెచ్చరిక కూడా జారీ చేశాడు.

ఇంతకుముందు జడేజా ‘తగ్గేదే లే’ అనే యూట్యూబ్ షార్ట్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు తాజా చిత్రం ‘పుష్ప’ ఉత్తర భారత ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ వల్ల రెండవ భాగం అంటే ‘పుష్ప: ది రూల్’పై భారీ హైప్ పెరిగింది.

Related Articles

Latest Articles