ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలని పాన్ ఇండియా సినిమాలు చేసే అంతలా ఇంపాక్ట్ చూపించాడు ప్రభాస్. అట్టర్ ఫ్లాప్ సినిమాతో కూడా అయిదు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో, ప్రభాస్ సినిమాలకి ఎంత బిజినెస్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో డిజప్పాయింట్ చేసిన ప్రభాస్, ఈసారి మాత్రం మూడు సినిమాల కలెక్షన్స్ ని ఒకే సినిమాతో తీసుకొని రావడానికి రెడీ అయ్యాడు. రెండు నెలలు తిరగకుండానే ప్రభాస్ సలార్ సినిమాతో బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయి అనేది ఊహించడం కూడా కష్టమే. ఈ సెప్టెంబర్ 28 నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి కష్టాలు తీరిపోతున్నాయి. సలార్ తో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కెతో పాటు మారుతి సినిమా కూడా చేస్తున్నాడు. డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు 2024లోనే ఆడియన్స్ ముందుకి రానున్నాయి.
2023 సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఎండ్ అయ్యే లోపు మూడు సినిమాలని రిలీజ్ చేస్తున్న ప్రభాస్, ఒక ఇండియన్ హీరో ఒక ఏడాదిలో కలెక్ట్ చేయనన్ని వసూళ్లని రాబట్టనున్నాడు. ఈ సినిమాలు రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రభాస్, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా కమిట్ ప్రభాస్, ఈ సినిమాని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయనున్నాడు. సందీప్ ప్రస్తుతం హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే స్పిరిట్ స్టార్ట్ అవ్వనుంది. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్… యానిమల్ సినిమాకు కూడా సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్లు టాక్. దాంతో నెక్స్ట్ ‘స్పిరిట్’కు ఈయన మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫైనల్ అయినట్టు టాక్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు.