Murali Mohan: అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల విషయం అటు అభిమానులే కాదు ఇటు సెలబ్రిటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ముచ్చటగా నాలుగేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక చాలామంది సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. తాజగా సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈ జంట విడాకుల గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీ మోహన్, చై- సామ్ విడాకుల గురించి మాట్లాడారు. “హైదరాబాద్ లో మాకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిని నేను నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకున్నాను. నా కుటుంబం కోసం మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేయించాను. నా కొడుకుకు, నాకు, నా తమ్ముడికి మాత్రమే అనుకొని ఆ అపార్ట్మెంట్స్ తీసుకున్నాను. అయితే ఒకరోజు చై మా ఇంటికి వచ్చి ఇల్లు చూసి తనకు కావాలని అడిగాడు. నేను ముందే చెప్పాను.. ఇది కేవలం మా కుటుంబం కోసమే కట్టించుకున్నాను అని చెప్పాను.
చై ఇంటికి వెళ్లి నాగార్జున చేత నన్ను అడిగించాడు. అక్కినేని నాగేశ్వరరావు కు వీరాభిమానిని కావడం తో నాగ్ అడగానే ఓకే అన్నాను. ఆ తరువాత చైతు ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. పెళ్లి తర్వాత సామ్ తో కలిసి ఉండేవాడు. ఎప్పుడూ ఎటువంటి గొడవ వారి మధ్య జరగడం నేను చూడలేదు. అసలు వారిద్దరు విడిపోతున్నారు అని నాకు మా పనిమనిషి చెప్తేనే తెల్సింది. ఈ విషయం కొద్దిగా ముందు తెల్సినా నేనే వారితో మాట్లాడి కలిసి ఉండేలా చేసేవాడిని. ఇద్దరూ చూడముచ్చటగా ఉండేవారు. కలిసి వాకింగ్ చేసేవారు. కుక్కపిల్లలతో ఆడుకొనేవారు. వారు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ జంట మధ్య గొడవలు లేవు అంటే.. మరి ఏ కారణం వలన వీరు విడిపోయారు అంటూ నెటిజన్స్ ఆలోచిస్తున్నారు.