Guntur Kaaram: సాంగ్ వస్తుంది అనే వార్త వినిపిస్తూనే ఉంది… కానీ ఎప్పుడో తెలియదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఉంది. చాలా రోజులగా డిలే అవుతు వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి కానుకగా గుంటూరు కారం రిలీజ్ చేయాలనే టార్గెట్‌గా షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం మాస్ స్ట్రైక్ పేరుతో ఒక చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ జస్ట్ పోస్టర్స్‌తోనే సరిపెట్టారు మేకర్స్. అయితే తమన్ మాత్రం ఇప్పటికే అదిరిపోయే ట్యూన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. సాంగ్ కూడా రెడీ అయ్యి… ఫైనల్ మిక్సింగ్ లో ఉందని సమాచారం.
సింగర్ అనురాగ్ కులకర్ణి ఒక వర్షన్ పాడరాని సమాచారం. అక్టోబర్ లో దసరా కనుకుగా ఈ సాంగ్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారనే మాట వినిపిస్తుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు కానీ దాదాపు దసరా రోజునే సాంగ్ వచ్చే అవకాశముందని సమాచారం. అయితే ఇలా గుంటూరు కారం సినిమా నుంచి మొదటి సాంగ్ బయటకి రానుంది అనే మాట వినిపించడం ఇదే మొదటిసారి కాదు. మహేష్ బాబు బర్త్ నుంచి వినాయక చవితి వరకూ చాలా సార్లు గుంటూరు కారం సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ అవుతుంది అనే మాట వినిపించింది కానీ సాంగ్ మాత్రం బయటకి రాలేదు. అందుకే మరి ఈసారి దసరా పండగ రోజైన ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇస్తూ గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందా లేక ఇప్పుడు కూడా రూమర్ గా మాత్రమే మిగిలిపోతుందా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!