ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి అవసరం లేదు.. సాధారణ హీరోలను స్టార్ గా నిలబెట్టిన గొప్ప డైరెక్టర్.. ఒక ఒక్కడు, ఒక వర్షం, ఒక నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ సినిమాలన్నీ హీరోలను స్టార్ లుగా మార్చేసినవే.. ఇక ఆ దర్శకుడు నుంచి నిర్మాత గా కూడా పలు హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం ఆయన తన కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా ‘7డేస్ 6 నైట్స్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమైంది. ఇక ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకులు ఒక షోలో సందడి చేశారు. ఇక ఈ షోలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తానూ ఎంతమంది హీరోలను స్టార్లుగా చేసింది.. ఏ ఏ సినిమాలకు స్క్రిప్ట్ రాసింది.. అనేది వివరంగా చెప్పారు. తాను నిర్మించిన చాలా చిత్రాలు సంక్రాంతి సీజన్‌లో విడుదలవడం వల్ల తనని ‘సంక్రాంతి రాజు’ అని చాలామంది పిలిచేవారని చెప్పారు అంతేకాకుండా దేవి సినిమాతో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను, వర్షం చిత్రంతో త్రిషను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో ప్రభుదేవాను తెలుగు తెరకు పరిచయం చేసింది తానే అని చెప్పుకొచ్చారు.
ఇక ఒక్కడు సినిమా సెట్ లో భూమిక ఒక ఫైటర్ పై ఫైర్ అయిన విషయమై మాట్లాడుతూ ” ఆరోజు సెట్ లో నేను, మహేష్, భూమిక పక్కపక్కనే కూర్చొని ఉన్నాం.. సడెన్ గా ఒక ఫైటర్ పై భూమిక ఫైర్ అయ్యింది. ఇంగ్లీష్ లో భయంకరంగా బూతులు తిట్టింది. అది చూసి అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. అయితే ఆమె ఎందుకు కోపం తెచ్చుకుంది.. అప్పుడు మహేష్ ఏమన్నాడు అనేది ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. ఇక తన సినిమా డర్టీ హరి గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేను అన్ని జోనర్లు ట్రై చేశాను.. ఇక ఎవరు ఏమనుకున్నా డర్టీ హరి తీయాలనిపించింది .. తీసేశాను.. చాలామంది విమర్శించారు.. ఎవరు ఏం అనుకున్నా, విమర్శలు ఎదురైనా సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకుని ముందడుగేసా అని చెప్పుకొచ్చారు.