Mrunal Thakur: సీతారామం చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. సీతగా కనువిందు చేసి తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతో వరుస ఆఫర్లను అందుకొంటుంది. ఇక ఈ తెలుగు సినిమాతో మృణాల్ తన జీవితమే మారిపోయిందని చెప్పుకొచ్చింది. సీరియల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఎట్టకేలకు మృణాల్ తన మనసులో మాటను బయటపెట్టింది. ఏ ఇండస్ట్రీలోనైనా తమకు నచ్చిన హీరోతో పనిచేయాలని ఏ హీరోయిన్ కైనా ఉంటుంది.
ఇక అదే విషయాన్నీ మృణాల్ చెప్పుకొచ్చింది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. వీరిలో ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు టక్కున ఎన్టీఆర్ అని చెప్పేసి సిగ్గుపడిపోయింది. ఇక దీంతో మృణాల్.. తారక్ పై మనసు పారేసుకుందని చెప్పకనే చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కనుక మృణాల్ ను సెలక్ట్ చేస్తే ఆ కాంబో అదిరిపోతోందని చెప్పుకొస్తున్నారు. మరి అభిమానుల కోరిక కొరటాల తీరుస్తాడో లేదో చూడాలి.