Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ అయినా వెంటనే వైరల్ అయిపోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను రూ.800 కోట్లతో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. మొదట్లో శ్రీలీల, జాన్వీకపూర్ పేర్లు బాగా వినిపించాయి. ఆ తర్వాత మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల పేరే వచ్చింది. కానీ తాజాగా వారెవరూ కాకుండా బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మృణాల్ తో చర్చలు జరిపిన డైరెక్టర్ ఆమెను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.
Read Also : Mohan Lal : బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోన్న’తుడరుమ్’
ఈ మూవీ గురించి ఏ అప్డేట్ కూడా ప్రకటించట్లేదు. బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారంట. రీసెంట్ గానే ముంబైలో పూజా కార్యక్రమం కూడా చేసేసినట్టు తెలుస్తోంది. కానీ అందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను బయటకు వదల్లేదు. ముంబైతో పాటు విదేశాల్లోనే ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఇంకా ఎవరెవరు నటిస్తారనేది బయటకు రావట్లేదు. ప్రస్తుతం నటీనటులను తీసుకునే పనిలో బిజీగా ఉన్నాడంట అట్లీ. త్వరలోనే మూవీ గురించి వరుస అప్డేట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.