మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ వారం రిలీజ్ అయిన విరూపాక్ష మూవీ.. అదిరిపోయే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు నటుడిగా సాయితేజ్‌ను మరో మెట్టు ఎక్కించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉండడంతో ముందు నుంచీ విరూపాక్షపై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే ఈ సినిమా డే వన్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు హీరోలు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సాయి ధరమ్ తేజ్‌కు, చిత్ర యూనిట్‌కు తన అభినందనలు తెలిపారు. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదిరిపోయిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
రెండు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్. మొదటి స్థానంలో గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ‘విన్నర్’ సినిమా ఉంది. దీంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా విరూపాక్ష నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది. ఈ టార్గెట్ సాయి ధరమ్‌కు మార్కెట్‌కి మించి ఉన్నప్పటికీ.. సినిమా సాలిడ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ని టచ్ చేస్తుందని అంటున్నారు. మొత్తంగా మెగా మేనల్లుడు ప్రస్తుతం థియేటర్లలో దుమ్ముదులుపేస్తున్నాడు మరి ఇదే జోష్ తో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి విరుపాక్ష సినిమాని తీసుకోని వెళ్తాడేమో చూడాలి.