2019 లో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం మత్తు వదలార. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్ గా వస్తుంది మత్తు వదలారా 2 . రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహ కోడూరి, సత్య జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ నుంచి టీజర్ నుంచి ప్రమోషనల్ సాంగ్ వరకు ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో డిఫ్రెంట్ గా ప్లాన్ చేసాడు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Raed : MegaStar : ఆత్మారావుగా ‘కంట్రీ డిలైట్’ యాడ్ లో అదరగొట్టిన ‘మెగాస్టార్ చిరంజీవి’
ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసారు. హెచ్‌ఈ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్లుగా పనిచేస్తున్న శ్రీ సింహ మరియు సత్య, వారు పట్టుకున్న కిడ్నాపర్‌ల నుండి డబ్బును గుంజుతు, అనుకోకుండా ఒకరిని హత్య చేస్తారు. దాంతో ఓ ప్రత్యేక బృందం వారిని కోల్డ్ బ్లడెడ్ హంతకులుగా పరిగణిస్తూ పట్టుకోవాలి చూస్తుంటారు. దర్శకుడు రితేష్ రానా సీక్వెల్ కోసం మరొక అద్భుతమైన నేపథ్యాన్ని ఎంచుకున్నాడు, ప్రతి పాత్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషించేలా వేగవంతమైన స్క్రీన్ ప్లే తో షాట్ పంచులతో అలరించాడు. లాస్ట్ లో వచ్చిన అల్లుడు డైలాగ్ ట్రైలర్ కె హైలెట్. శ్రీ సింహ కోడూరి మరియు సత్య పాత్రలు అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉండేలా డిజైన్ చేసారు. ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ రోహిణి, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించారు. సెప్టెంబరు 13న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.