వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు మెగాస్టార్. ఒకపక్క సినిమాలు మరోపక్క యాడ్స్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. చిరు యాడ్స్ లో నటించడం ఇప్పుడు కొత్తేమి కాదు గతంలో థమ్స్ అప్, నవరత్న యాడ్స్ లో కనిపించి ఫ్యాన్స్ ను అలరించారు. తాజాగా ‘కంట్రీ డిలైట్’ అనే మిల్క్ బ్రాండ్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ను కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు.
Also Raed : Release Clash : దేవరకు పోటీగా రేస్ లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో..
ఈ యాడ్ లో తన మార్క్ నటనతో చిరంజీవి ఈ యాడ్‌లో ఆకట్టుకున్నారు. మెగాస్టార్ యాడ్ కు సంభందించిన తన డైలాగ్ వెర్షన్ ప్రిపేర్ అవుతుండగా కమెడియన్ సత్య షాట్ రెడీ అనగానే చిరంజీవిలో నుంచి గీతల చొక్కా, లుంగీ, కళ్లద్దాలు పెట్టుకున్నా ఆత్మారావు బయటకొచ్చి చెప్పిన డైలాగ్ లు నవ్వులు పూయించాయి. గతంలో చిరు నటించిన అన్నయ్య సినిమాలోని ఆత్మరావు క్యారక్టర్ ను ఈ యాడ్ లో మరోసారి చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్. వీరిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ లోనే పాల బ్రాండ్, దాని గొప్పదనం, పాలను బుక్ చేసుకునే విధానాన్ని చక్కగా చూపించారు. చివరి షాట్ లో ఒక్క షాట్ కి రిహార్సల్స్ ఆ, ఊరికినే అయిపోతారా మెగాస్టార్లు అని సత్య చెప్పిన డైలాగ్ యాడ్ కె హైలెట్ గా నిలిచింది. ఈ యాడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ మాస్ కమర్షియల్ యాడ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.