Mr Bachhan: మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కలిసి మిస్టర్ బచ్చన్‌తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మొదటి డైలాగ్ నుంచే ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్. “సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు… సంపద కాపాడేవాడు కూడా సైనికుడే…” అంటూ మొదలైన ఈ ట్రైలర్ లో రవితేజ కమాండింగ్ ప్రెజెన్స్‌ని హైలైట్ చేసేలా ఉంది. బచ్చన్ జిక్కీ అదేనండీ మన భాగ్య శ్రీతో గాఢంగా ప్రేమలో ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే మిస్టర్ బచ్చన్ అనే ఇన్కమ్ టాక్స్ అధికారిగా అదరకొట్టాడు.
Also Read: Kalki 2898 AD: ఇదిరా క్రేజ్ అంటే.. కల్కి కోసం హైదారాబాద్ వచ్చిన జపనీయులు
ట్రైలర్‌లోని హైలైట్‌లలో ఒకటి రెప్పల్ డప్పుల్ అనే హై-ఎనర్జీ నంబర్ కూడా. ఒక శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా IT దాడులకు నాయకత్వం వహించడానికి రవితేజ ముందుకు వెళ్లాడు. ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో రొమాన్స్, డ్రామా మరియు యాక్షన్ అన్నీ ఉన్నాయని అర్థం అవుతుంది. టైటిల్ రోల్‌లో రవితేజ నటన, చరిష్మా, మాగ్నెటిక్ ప్రెజెన్స్‌తో స్క్రీన్‌పై కమాండింగ్ అదిరిపోయింది. భాగ్యశ్రీ బోర్సే తన అద్భుతమైన గ్లామర్, ఆకర్షణతో రవితేజ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు సత్య అండ్ గ్యాంగ్ కామెడీ కూడా బాగుంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం రిచ్ నెస్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్, తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటించారు.