Lucky Baskhar Trailer : ఆసక్తి పెంచేస్తున్న లక్కీ భాస్కర్ ట్రైలర్
- 'లక్కీ భాస్కర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు దుల్కర్ సల్మాన్
- ఈరోజు 'లక్కీ భాస్కర్' ట్రైలర్ రిలీజ్
- ట్రైలర్ కు అదనపు బలంగా ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేసే భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. తాను తలచుకుంటే ఏదైనా చేయగలిగే అంత ధనవంతుడు కావాలని అనుకుంటాడు. బాగా డబ్బు సంపాదిస్తే, శ్వాస కూడా గౌరవించబడుతుంది అనేది అతని సిద్ధాంతం.
Bigg Boss 8 Telugu: ఆ కంటెస్టెంట్ ను వెనక్కి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు
Also Read
ఇక భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా ఒదిగిపోయారు. ఇక ట్రైలర్ లో “Sumathi, I’m not bad, I’m just rich”, “సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ”, “ఇది ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి రెస్పెక్ట్ కావాలంటే అ డబ్బు మన ఒంటి మీద కనిపించాలి” వంటి పదునైన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ కు అదనపు బలంగా నిలిచింది. ఇప్పటికే పాటలతో విశేషంగా ఆకట్టుకున్న ఆయన, నేపథ్య సంగీతంతో అద్భుతాలు సృష్టించబోతున్నారని ట్రైలర్ తో చెప్పేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ‘లక్కీ భాస్కర్’ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!