VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ప్రయోగాలు పక్కన పెట్టి ఈసారి ఒక పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తే ఎలా ఉంటుందో ‘వీరభద్రుడు’ ట్రైలర్ నిరూపించింది. కరుప్పుగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో వీరభద్రుడుగా తీసుకువస్తున్నారు. RJ బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుట్రైలర్ రిలీజై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “చిన్న గ్యాప్ ఇస్తే.. ఫైర్ తగ్గిపోయింది అనుకున్నారా? వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు!” అంటూ వినిపిస్తున్న డైలాగ్స్ సినిమాలోని పవర్‌ను చూపిస్తున్నాయి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రైలర్ గమనిస్తే.. కోర్టులో న్యాయం కోసం పోరాడే ఓ అమ్మాయి కోసం వీరభద్రుడిగా లాయర్ కోటు ధరించి శత్రువులను ఎలా అణిచివేశాడనేది కథ మూలాంశంగా కనిపిస్తోంది. సూర్య గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ రోల్‌లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ మరియు సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు RJ బాలాజీ ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్‌గా అంతే పవర్‌ఫుల్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సూర్య నటనలో ఆ కసి, కళ్ళలో ఆ ఫైర్ చూస్తుంటే థియేటర్లలో ‘పీక్ విధ్వంసం’ ఖాయమని స్పష్టమవుతోంది. GK విష్ణు డీవోపీ, సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ సమ్మర్ సీజన్‌లో భారీ అంచనాల మధ్య ఈ నెల 14న ‘వీరభద్రుడు’ ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్స్‌పై విడుదల కానుంది. పోటీలో సినిమాలేవి లేకపోవడం థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. జస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంటే సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందని ట్రేడ్ అంచనా. సాలిడ్ కంబ్యాక్ కోసం చూస్తున్న సూర్య థియేటర్ల వద్ద వీరభద్రుడిగా ఎలాంటి అరాచకం చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!