మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.…