బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తిచేసుకున్న ఈ షో 8 వారంలోకి అడుగుపెట్టింది. అయితే నిన్న ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుని మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి చివరిగా మణికంఠ, గౌతమ్ మధ్య చివరి ఎలిమినేషన్ ప్రక్రియ జరగగా.. అందరికీ పెద్ద షాకిచ్చాడు మణికంఠ. ఇక నేను గేమ్ ఆడలేను, నావల్ల కాదు.. అని సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు, ఒక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇంటికి తిరిగి హౌస్ లోకి రావచ్చని వార్తలు తెరమీదకు వస్తున్నాయి.
India’s Richest Cine Hier : ఇండియాలో మోస్ట్ రిచ్చెస్ట్ సినీ వారసుడు ఎవరో తెలుసా?
సోనియా అకుల లేదా ఆదిత్య ఓం హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు అయితే సోనియా మళ్లీ షోలోకి రావాలని కోరుకుంటున్నారు కానీ ఆమె మాత్రం అంత ఆసక్తిగా లేదు. తనను కావాలనే బిగ్ బాస్ నిర్వాహకులు బాడ్ చేశారని ఆమె నమ్ముతోంది. కాబట్టి, ఆదిత్య ఓంను వారు లోపలికి సెకండ్ ఆప్షన్ గా పంపే ప్రయత్నం చేస్స్తున్నారు. రానున్న రోజుల్లో మేకర్స్ ఎలాంటి సర్ ప్రైజ్ చేస్తారో చూడాలి. ఇక ప్రతి వారం లానే ఈరోజు నామినేషన్ల ప్రక్రియ హోరాహోరీగా సాగనుంది.