దసరా బరిలో దిగడానికి యంగ్ హీరోలంతా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 15న ‘వరుడు కావలెను’ చిత్రంతో పలరించబోతున్నట్టు నాగశౌర్య ప్రకటించాడు. తాజాగా అక్కినేని అఖిల్ కూడా దసరా వార్ కు కాలు దువ్వుతున్నాడు. అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Read Also : సన్నాసుల్లారా కోట్లు ఊరికే రాలేదు : పవన్
ముందుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను 2020 ఏప్రిల్ 2న శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. దీంతో 2021 జనవరిలో అన్నారు. తరువాత 2021 ఏప్రిల్… ఆ సమయంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా సినిమా థియేటర్లను మళ్లీ మూసివేసింది. విడుదల మళ్లీ ఆలస్యం అయింది. ఇది కూడా వాయిదా పడి జూన్ 19కి పోస్ట్ పోన్ చేశారు. కొన్నిరోజుల క్రితం ఆగష్టు 8న సినిమా విడుదల తేదీగా ప్రకటించారు. తాజాగా దాన్ని కూడా మార్చేసి అక్టోబర్ 15 ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రాబోతున్నాడు.