సన్నాసుల్లారా కోట్లు ఊరికే రాలేదు : పవన్

సినిమా సమస్యల గురించి, ఇండస్ట్రీ, టికెట్ రేట్లు, ఏపీలో థియేటర్ల విషయమై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రిపబ్లిక్”. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్. వాళ్ళను ఏమన్నా అంటే ఎవరూ మాట్లాడరు. రాజకీయ నాయకుల గురించి మాట్లాడండి. ఇళ్ల నుంచి బయటకు లాగి కొడతారు. తేజ్ మీద మాట్లాడతారు. ఇప్పటికి హాస్పిటల్ బెడ్ పై కళ్ళు తెరవకుండా పడి ఉన్న తేజ్ అమాయకుడు కదా. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సమాజానికి అది కదా ఉపయోగపడేది.

Read Also : చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక

ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే చిత్రపరిశ్రమను ఆపేస్తే మన కాళ్ళ దగ్గరకు వస్తారని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ఎంతసేపూ సినిమాల్లో దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు కోట్లు తీసుకున్నారు అంటే… అరే సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా లెక్కలు చెప్తా… ఒక హీరోగాని, హీరోయిన్ గానీ, దర్శకుడు గానీ 10 కోట్లు తీసుకున్నారంటే… అందులో ఇండియాలోనే హైయెస్ట్ ట్యాక్స్ 45 శాతం. అంటే చేతికి 6.5 కోట్లు మాత్రమే వస్తాయి. అందులోనే అన్నింటినీ కవర్ చేసుకోవాలి. ‘బాహుబలి’ లాంటి సినిమా వచ్చిందంటే ప్రభాస్, రానా లాగా కండలు పెంచాలి. ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన డ్యాన్స్ చేస్తే వస్తాయి కోట్లు. రామ్ చరణ్ లాంటి నటుడు అద్భుతమైన గుర్రపు స్వారీ చేస్తే వస్తాయి. అలాగే కిందామీదా పది ఎముకలు విరగ్గొట్టుకుంటే వస్తాయి కోట్లు. మేము అడ్డగోలుగా వేల కోట్లు సంపాదించట్లేదు” అంటూ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.

-Advertisement-సన్నాసుల్లారా కోట్లు ఊరికే రాలేదు : పవన్

Related Articles

Latest Articles