రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయగా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ టాకుతో దూసుకుపోతోంది. గతంలో డాక్టర్ బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్ గా రమ్యకృష్ణ కనిపించగా తమన్నా, సునీల్, శివ రాజ్ కుమార్ మోహన్ లాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు. మలయాళ నటుడు వినాయకన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందించినట్లు తెలుస్తోంది.
Kushi: ‘ఖుషి’పై కాపీ ఆరోపణలు.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్
ఈ మేరకు స్టాలిన్ నెల్సన్ దిలీప్ కుమార్ ను అభినందిస్తున్నట్లు ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే స్టాలిన్ స్వయంగా నెల్సన్ దిలీప్ కుమార్ కార్యాలయానికి వెళ్లారా? లేక నెల్సన్ దిలీప్ కుమార్ స్టాలిన్ కార్యాలయానికి వెళ్ళారా అనే విషయం మీద ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఇక ఈ జైలర్ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ జైలు సినిమా రజనీకాంత్ కి ఒక కం బ్యాక్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు రోబో 2.0 తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన రజనీకాంత్ సినిమాగా నిలిచింది. అంతేకాక ఈ మధ్యకాలంలో విడుదలైన అన్ని తమిళ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఏడు కోట్ల వరకు షేర్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.