Siva Nirvana responds on Copy Allegations: సినీ ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ఆరోపణలు రావడం కామన్. టీజర్, ట్రైలర్ రిలీజైనప్పుడు వాటిలో సీన్స్ చూసి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేస్తారు నెటిజన్లు. ఇప్పుడు విజయ్ ఖుషి మూవీ మణిరత్నం సూపర్ హిట్ మూవీ సఖికి కాపీ వర్షన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.రిసెంట్ గా ‘ఖుషి’ ట్రైలర్ ని లాంచ్ చేశారు మేకర్స్. కంటెంట్ కొత్తగా ఉండటంతో ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా మణిరత్నం క్లాసిక్ ‘అలైపాయుతే'(తెలుగులో సఖి) కి అన్ అఫీషియల్ రీమేక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మణిరత్నం సఖి చిత్రానికి ఖుషి మూవీకి మధ్య కొన్ని దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్ లో సమంతని చూసి విజయ్ ప్రేమలో పడతాడు. ఆమె బ్రాహ్మణ కులానికి చెందిన యువతి. విజయ్ దేవరకొండ క్రిస్టియన్. వీళ్లిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యులు అంగీకరించరు.
Nani: ఛీఛీ.. ఏం సినిమా అది.. తీశావులే బోడి ‘బాహుబలి’ అని రాజమౌళిని అనేసింది
పెద్దలకి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ వారి మ్యారేజ్ లైఫ్ అనుకున్నంత సాఫీగా సాగదు. దాదాపు సఖి స్టోరీ కూడా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే సఖిలో మెడికల్ కాలేజీ బ్యాక్ డ్రాప్ కాగా దానిని ఖుషీలో దర్శకుడు శివ నిర్వాణ కశ్మీర్ బ్యాక్ డ్రాప్ గా మార్చారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. సఖి, ఖుషి మధ్య కొన్ని షాట్స్ కూడా సేమ్ ఉన్నాయని స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఖుషి కాపీ క్యాట్ విమర్శల పై దర్శకుడు శివ నిర్వాణ స్పందించినట్టు చెబుతున్నారు. ఖుషి ట్రైలర్, మాధవన్ హిట్ మూవీ కి కాపీలా ఉందంటున్నారు అయితే, ప్రేమ, పెళ్లి అనే విషయాలు చాలా సినిమాల్లో కామన్ గా ఉంటాయి. వాటిని మనం మార్చలేం అని అన్నట్టు తెలుస్తోంది. ప్రేమకథలో ఏది చెప్పాలనుకున్నా, ప్రేమ ఉండాలి. పెళ్లి కథలో పెళ్లి ఉండాలి” ఒకరకంగా బోరింగ్ డైలాగ్స్, డ్రామా లేకుండా ప్రేక్షకులను సినిమాలో లీనం అయ్యేలా చేయడమే ముఖ్యం అని ఆయన చెప్పుకొచ్చారు. అలా ఈ సినిమా మణిరత్నం సినిమాకి కాపీ వర్షన్ కాదంటూ తెల్చేశాడు ఆయన. మరి సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని పొలికలు వస్తాయో చూడాలి.