ప్రస్తుతం తెలుగు సినిమాలు కంటెంట్‌తో పాటు క్వాలిటీ విషయంలో కూడా మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్లోనూ అద్భుతాలు చేస్తున్న మూవీస్ వరుసగా వస్తున్నాయి. వాటిలో తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘మిరాయ్’. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో చూపించిన విజువల్ ఫీస్ట్ సినిమా హైలైట్‌గా నిలవడంతో, ఇదే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోయే తదుపరి చిత్రం ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన హైప్ ఏర్పడింది.
Also Read: Jagapathi Babu : కొత్త ప్రయాణం మొదలు పెట్టిన జగపతి?
‘మిరాయ్’ సమయంలోనే తేజ సజ్జా అండ్ టీమ్ VFX అవుట్‌పుట్ పై కాన్ఫిడెన్స్ చూపించారు. దీనికి కారణం పీపుల్ మీడియా దగ్గర వేరు VFX టీం ఉండడమే. వారి కష్టం, నైపుణ్యం ‘మిరాయ్’లో స్పష్టంగా కనిపించింది. అందుకే ఇప్పుడు అభిమానులు ‘రాజా సాబ్’లో ఇంకా గ్రాండ్ విజువల్స్ వస్తాయని నమ్ముతున్నారు. ఇంతలో బాలీవుడ్‌లోని ఒక నిర్మాత చేసిన కామెంట్ కూడా హాట్ టాపిక్ అయింది. “రాజా సాబ్‌లో హ్యారీ పోటర్ స్థాయి విజువల్స్ కనబడతాయి” అని ఆయన చెప్పడం ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ను మరింత పెంచింది. మొత్తానికి, ‘మిరాయ్’ సక్సెస్‌తో వచ్చిన VFX నమ్మకం.. ఇప్పుడు ‘రాజా సాబ్’ విజువల్స్‌పై కొత్త అంచనాలు క్రియేట్ చేసింది.