Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే వారికి ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియాను ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చే క్రమంలో భారత ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను నిర్వహిస్తోంది. ఈ వేవ్స్ సంస్థలో మెగాస్టార్ చిరంజీవి సభ్యుడిగా ఉన్నారు. ముంబయిలో మే 1 నుంచి 4 వరకు జరగనున్న ఈ వేవ్స్ సభ కోసం తాజాగా చిరంజీవి పోస్టు చేశారు. మీ ట్యాలెంట్ ను నిరూపించుకోవాలి అనుకుంటే ఈ వేవ్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈవెంట్ కు రావాలన్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల వారికి స్పెషల్ గా వెల్ కమ్ చెప్పారు.
Read Also: Vijayashanti : హీరోలనే కాదు.. హీరోయిన్లనూ గౌరవించండి : విజయశాంతి
‘నేను కూడా మొగల్తూరు నుంచి ఇండస్ట్రీలోకి ఎంతో ఇష్టంతో వచ్చాను. అప్పుడు ఇలాంటివి లేవు. ఇప్పుడు ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి మేమంతా ఉన్నాం. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ను తెలుసుకోవడానికి, మీరేంటో నిరూపించుకోవడానికి వేవ్స్ వచ్చింది. వేవ్స్ ను కరెక్ట్ గా యూజ్ చేసుకుని మీ ట్యాలెంట్ ను నిరూపించుకోండి. ఇది మీ కెరీర్ టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ఈ వేవ్స్ సమ్మిట్ లో అన్ని రంగాల ప్రముకులు పాల్గొంటున్నారు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఆయా రంగాల్లో ముందుకు వెళ్లాలి అనుకున్న వారు తమ కలలను పంచుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.
https://www.instagram.com/reel/DIwJiD6pV74/?utm_source=ig_web_copy_link