Vijayashanti : అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చింది. సర్కారు వారి పాట సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో పలకరించింది. ఈ సినిమాలో ఆమెకు మంచి పాత్ర దక్కింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె మెరిసింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మీడియాకు స్పెసల్ రిక్వెస్ట్ చేసింది. ‘చాలా సార్లు మీడియా వాళ్లు హీరోయిన్లను ఇంటర్వ్యూ చేస్తుంటారు. నేను కూడా చాలా ఇంటర్వ్యూలు చూస్తాను. మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు హీరోయిన్లను ‘నువ్వు’ అని సంబోధిస్తున్నారు. అలా కాకుండా ‘మీరు’ అనండి.
Read Also: Nani : డైరెక్టర్ పై సీరియస్ అయ్యాను.. నాని షాకింగ్ కామెంట్స్..
అప్పుడు హీరోయిన్లకు కూడా గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. కేవలం హీరోలనే కాదు హీరోయిన్లను కూడా గౌరవించండి. మీడియా వాళ్లు గౌరవిస్తే హీరోయిన్లను అందరూ గౌరవిస్తారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. కేవలం నా అభిప్రాయం ఇది’ అంటూ చెప్పుకొచ్చింది విజయశాంతి. అలాగే నెగెటివ్ రివ్యూలపై కూడా మొన్న సీరియస్ అయింది విజయశాంతి. తమ సినిమాపై కావాలని నెగెటివ్ రివ్యూలు రాసే వారికి వార్నింగ్ ఇచ్చింది. ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతనే నెగెటివ్ రివ్యూలపై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.