Meera Chopra: ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. కొంతమంది ప్రేమించినవారికి పెళ్లి చేసుకోగా .. ఇంకొంతమమంది పెద్దలు చూపించినవారిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇక ఆ లిస్ట్ లోకి తాను కూడా చేరుతున్నాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ మీరా చోప్రా. 1920: లండన్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసినా మీరా చోప్రా తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వాన సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. స్టార్లతో అయితే చేసింది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక దీంతో తెలుగుకు దూరంగా బాలీవుడ్ కు దగ్గరగా ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదంటూ ఒక ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ భామను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో అందరికి తెలిసిందే.
ఇక ఈ చిన్నది కొత్త ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపింది. క్రిస్టమస్ వేడుకల్లో ఈ చిన్నది ఒక వ్యక్తితో కలిసి కనిపించింది. అతనితో క్రిస్టమస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ.. ” ప్యార్ వాలా క్రిస్టమస్” అని రాసుకొచ్చింది. దీంతో మీరా ప్రేమలో ఉందని తెలిసింది. ఇక దీంతో అభిమానులు పెళ్లి చేసుకుంటున్నారా.. ? అని కామెంట్స్ పెడుతుండగా.. తాజాగా ఆ వార్తలకు అమ్మడు స్పందించింది. ” ‘అవును నిజమే.. నేను పెళ్లి చేసుకుంటున్నాను. 2024 ఫిబ్రవరి నెలాఖరున నా పెళ్లి జరగనుంది. ఇప్పటికే నా కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. నా పెళ్లివేడుక రాజస్థాన్‌లో గ్రాండ్‌గానే జరగనుంది. మా పెళ్లి వేడుకకు 150 మంది అతిథులు హాజరవుతారు” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు మేరకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.