మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వర రావు’ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి లీకులు కూడా లేకుండా చాలా పకడ్బందీగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ వస్తుంది అంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మే 24న టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ పోస్టర్ ని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు.
Read Also: NTR: గ్లోబల్ రీచ్ ఉన్న హీరోకి పర్ఫెక్ట్ డిజైన్…
పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు, పాన్ ఇండియా ప్రమోషన్స్ కూడా చెయ్యాలి కదా. ఈ విషయాన్ని కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలతో బాగా అర్ధం చేసుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ‘టైగర్ నాగేశ్వర రావు’ ప్రమోషన్స్ కోసం పాన్ ఇండియా సూపర్ స్టార్స్ ని రంగంలోకి దించింది. సౌత్ నుంచి నార్త్ వరకూ 5 భాషల్లోని 5 మంది సూపర్ స్టార్స్ ‘టైగర్ నాగేశ్వర రావు’ ఫస్ట్ లుక్ ని లాంచ్ చెయ్యనున్నారు. హిందీ నుంచి సల్మాన్ ఖాన్, కన్నడ నుంచి శివన్న, మలయాళం నుంచి మోహన్ లాల్, తమిళ్ నుంచి రజినీకాంత్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది? ఎంత బజ్ జనరేట్ చేస్తుంది అనేది చూడాలి.
5 SUPERSTARS from 5 LANGUAGES are coming together to introduce #TigerNageswaraRao to the world ❤️🔥
First look on May 24th 💥💥#TNRFirstLookOnMay24@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1… pic.twitter.com/xkLbr8sxHl
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) May 16, 2023