మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ సెంట్రిక్ డ్రామా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది కానీ పోటీలో నుంచి రవితేజ స్వచ్ఛంధంగా తప్పుకోని మిగిలిన సినిమాలకి థియేటర్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సోలోగా థియేటర్స్ లోకి వస్తాను అని చెప్పిన రవితేజ… చెప్పినట్లుగానే ఈరోజు ప్రేక్షకులని పలకరించడానికి థియేటర్స్ లోకి వచ్చేసాడు. రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ఈగల్ సినిమాపై హైప్ పెరిగింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ అంతా ఈరోజు థియేటర్స్ కి వెళ్లడానికి రెడీ అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఈగల్ సినిమా షోస్ మరి కొద్దీ సమయంలో స్టార్ట్ అవనున్నాయి. ఓవర్సీస్ లో మాత్రం ఈగల్ షోస్ మిడ్ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయాయి.
ఈగల్ సినిమా చూసిన రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. Xలో పోస్ట్ చేస్తున్న ట్వీట్స్ ప్రకారం చూస్తే ఈగల్ సినిమాతో రవితేజ కంబ్యాక్ ఇచ్చినట్లే ఉంది. సినిమా బాగుంది, ఫైట్స్ అదిరిపోయాయి, రవితేజ మస్త్ ఉన్నాడు… సెకండ్ పార్ట్ కూడా ఉండే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ సినిమాలకి ఇంత పాజిటివ్ టాక్ రావడం ఇదే మొదటిసారి. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో డిజప్పాయింట్ చేసిన రవితేజ ఈగల్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాడో లేదో తెలియాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోస్ నుంచి కూడా టాక్ బయటకి రావాలి.