Mansoor Ali Khan: త్రిష పెళ్లి కూతురు.. నేను పెళ్లి కొడుకు.. సారీ ఎందుకు చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటించకపోవడం బాధాకరమని.. ముఖ్యంగా త్రిష తో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం.. అవి కాస్తా వైరల్ గా మారడంతో.. త్రిష కూడా స్పందించింది. ఇక ఇండస్ట్రీ మొత్తం త్రిషకు సపోర్ట్ గా నిలిచారు. నితిన్ దగ్గరనుంచి చిరంజీవి వరకు త్రిషకు సపోర్ట్ గా నిలిచారు. ఇక మన్సూర్ వ్యాఖ్యలపై నడిగర్ సంఘం కూడా ఫైర్ అయ్యింది. తాత్కాలికంగా అతడిని బ్యాన్ చేస్తూ.. త్రిషను బహిరంగంగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా కూడా మన్సూర్.. త్రిషకు సారీ చెప్పడం కుదరదు అని తేల్చి చెప్పడం షాకింగ్ కు గురిచేస్తోంది.
Saindhav: వెంకీ మామ బాగా చెప్పాడు కానీ, అది సెట్ అవ్వలేదే
Also Read
- Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
- Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
- Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
తాజాగా ఈ వివాదంపై మన్సూర్ ఆలీఖాన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరో కొత్త వివాదానికి తెరలేపాడు. ” త్రిషకు నేను సారీ ఎందుకు చెప్పాలి. నన్ను బ్యాన్ చేసిన నడిఘర్.. ఎందుకు బ్యాన్ చేసిందో నాకు నాలుగు గంటల్లో సమాధానం చెప్పాలి. నేను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుదారి పట్టించింది. అందుకు త్రిష కూడా స్పదించింది. నేను చేసిన వ్యాఖ్యలు అర్థం చేసుకోకుండా వ్యాఖ్యలను వక్రీకరించి రాసుకొచ్చారు.. త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదు. నాకు తమిళ ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో ఉంది. మా ఇద్దరి ఫొటోలు పక్క పక్కన ప్రింట్ చేశారు. వాటిని చూస్తే.. త్రిష పెళ్లి కూతురు.. నేను పెళ్లి కొడుకులా కనిపిస్తున్నాం.. అయితే నావి కొన్ని మంచి ఫోటోలు తీసుకుంటే బావుంటుంది” అని సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
-
NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!