ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల మధ్య పోటీ నడుస్తున్న విషయం విదితమే. వీటికి తగ్గట్టే స్టార్ హీరోలు సౌత్ వర్సెస్ నార్త్ అంటూ ట్విట్టర్ లో, మీడియాలో మాటల యుద్ధం జరుపుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా సౌత్ సినిమాలపై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న మనోజ్ భాజ్ పాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో కాకుండా తెలుగులో కూడా మంచి చిత్రాల్లో నటించి మెప్పించాడు .
ఇక తాజాగా సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ ” ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజిఎఫ్ 2’ చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భయపడుతున్నారు. ఈ సినిమాల కలెక్షన్లు, సక్సెస్ ను చూసి వారి వెన్నులో వణుకు పుట్టింది. సౌత్ సినిమాలో పనిచేసివారు ఎక్కువ ప్రొఫెషనల్ గా ఉంటారు. అది ఎలా ఉంటుందంటే.. ప్రతి షాట్ ను ప్రపంచంలోనే అత్యద్భుతమైన షాట్ గా రావాలని తపన పడతారు. అంటే కాకుండా ఏ భాషా ప్రేక్షకుడిని వారు తక్కువగా చూడరు. కొత్త కొత్త పాదాలను వాడరు.. ప్రేక్షకులు అర్ధం చేసుకొనే మాటలనే ఉపయోగిస్తారు. కానీ బాలీవుడ్ అలా కాదు బాక్సాఫీస్ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తారు. డబ్బు ఎంత ఖర్చుపెట్టినా అందులో భావం లేకపోతే అది ప్రేక్షకుల మనసులను తాకదు. ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎలాంటి సినిమాలు తీయాలి అని తలలు పట్టుకొని కూర్చున్నారు. ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఫిల్మ్ మేకర్స్ సౌత్ వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.