Manju Warrier: ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎంత త్వరగా అవుతాయో.. అంతే త్వరగా విడిపోతున్నారు. ఇక దానికి మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. మేము భార్యాభర్తలుగా లేకపోయినా మా పిల్లలకు తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తాం అని చెప్పుకొస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే విడిపోయాక కూడా సెలబ్రిటీలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. ఇంకొంతమంది అయితే కొత్త ప్రియుడు, కొత్త ప్రియురాలితో కలిసి మాజీ భార్యాభర్తలు పార్టీలు కూడా చేసుకుంటున్నారు. మరికొందరు.. కలిసి ఉండకపోయినా మీడియా ముందు వారి గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఒక హీరోయిన్ మాత్రం తన మాజీ భర్త పేరు పలకడానికి కూడా ఇష్టపడడం లేదు. ఆమె మలయాళ నటి మంజు వారియర్. ఈమె గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది.
ఇక మంజు వ్యక్తిగత విషయానికొస్తే.. ఆమె నటుడు దిలీప్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దిలీప్ కూడా అందరికి తెలుసు. హీరోయిన్ భావన పై అత్యాచారం చేసిన కేసులో జైలు, బెయిల్ అంటూ తిరుగుతున్నాడు. ఇక ఈ ఘటనకు ముందే దిలీప్ తో మంజు విడాకులు తీసుకుంది. అప్పటికే వీరికి ఒక పాప కూడా ఉంది. ఇక విడాకుల అనంతరం మంజు, సింగిల్ మదర్ గా ఉంటుంది. వరుస సినిమాలు చేస్తూ తన జీవితాన్ని సింగిల్ గా కొనసాగిస్తోంది. అయితే ఎప్పుడు ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అన్ని విషయాలు చెప్తుంది.. కానీ, దిలీప్ విషయం వచ్చేసరికి అతడి గురించి ఒక్క ప్రశ్న కూడా అడగొద్దు అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కూడా అతడి పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు మంజు. దీంతో యాంకర్ సైతం ముఖం మాడ్చేసి వేరే ప్రశ్న అడిగేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మంజుకు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాడి గురించి మాట్లాకపోవడమే కరెక్ట్ అని కామెంట్స్ పెడుతున్నారు.