Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ తండ్రి కాబోతున్నడా.. ? ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే మనోజ్.. తాను ప్రేమించిన భూమా మౌనికను పెళ్లాడాడు. వీరిద్దరికి అంతకుముందే వేరేవారితో పెళ్లి అయ్యింది. భూమా మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా మనోజ్ యాక్సెప్ట్ చేశాడు. ఆ చిన్నారి బాలుడును శివుడు తనకు బహుమతిగా ఇచ్చాడని మనోజ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మధ్యనే బాబు బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఇక ఈ నేపథ్యంలోనే మనోజ్ మొదటిసారి తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు మౌనిక ప్రెగ్నెంట్ అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. సాధారణంగా ఏ స్టార్ కపుల్స్ పెళ్లి చేసుకున్నా మూడు నెలల తరువాత ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయి అనేది అందరికి తెల్సిందే. ఇప్పుడు మనోజ్ విషయం లో కూడా అదే జరిగింది.
Gayathri Gupta: ఛీఛీ.. భర్తకు విడాకులిచ్చి.. ఇలాంటి పనులు చేస్తున్నావా.. ?
మనోజ్ కు మొదటి భార్య వలన కూడా పిల్లలు లేరు. ఇప్పుడు మౌనిక ప్రెగ్నెంట్ అయితే మనోజ్ మొట్ట మొదటిసారి తండ్రి కానున్నట్టే. మొదటినుంచి కూడా మనోజ్ కు పిల్లలు అంటే ఎంతో ఇష్టం. అన్న విష్ణు, అక్క లక్ష్మీ పిల్లలతో మనోజ్ ఎప్పుడు ఆడుతూ కనిపిస్తూనే ఉంటాడు. ఇక దీంతో అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే మనోజ్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే. ఇక మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకోపక్క రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం సినిమాలే కానీ రాజకీయాలు కాదని క్లారిటీ ఇవ్వడంతో ముందు ముందు సినిమాలతోనే రానున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.