రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించిన బ్రాండ్ ఫిల్మ్‌ను తెలుగు జీ 5 ఆవిష్కరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకుల కోసం దీన్ని రూపొందించారు. ఇందులో సంక్రాంతి పండుగ ఆత్మీయత అంతా ఘనంగా ప్రతిబింబిస్తోంది. అలాగే నిజంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తామనే జీ5 హామీ మరింత ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘మన పండగ, మన ఎంటర్టైన్మెంట్, మన తెలుగు జీ5’ అనే కమ్యూనికేషన్ లైన్‌తో రూపొందిన ఈ క్యాంపెయిన్, ప్రాంతీయ సంస్కృతి, ప్రేక్షకులతో జీ5కి ఉన్న గాఢమైన అనుబంధాన్ని తెలియజేస్తోంది.సంక్రాంతి సంబరాల మధ్య తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
Also Read : Peddi vs Paradise : ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సప్పుడు లేదేంటి? రిలీజ్ ఉన్నట్టా, లేనట్టా?
సంక్రాంతి సందర్భంగా రూపొందించిన సంప్రదాయ గ్రామీణ మండువ ఇంటి సెట్‌లో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను గమనిస్తే.. సంక్రాంతి పండుగకి అల్లుడు (మంచు మనోజ్) ఊరుకి వస్తుంటాడు. బస్సులో టికెట్ కండెక్టర్ అందరికీ కొరియన్ సినిమా చూపెడుతుంటాడు. అదెవరికీ అర్థం కాకుండా బాధపడుతుంటారు. అప్పుడు మనోజ్.. ఆ డ్రైవర్‌ను పేరు సుబ్బరావు అయితే అప్పారావు అనిపిలుస్తాడు. ‘ఎన్ని సార్లు చెప్పాలి సర్.. నా పేరు సుబ్బారావు అని, అప్పారావు కాద’ని అంటాడు. ‘నువ్వు చెప్పింది నాకు అర్థమైంది.. కానీ నువ్వు పెట్టిన సినిమానే మాకు అర్థం కాలేదు. మన పండగంటే మన ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలంటూ’ మనోజ్ చెప్పి తన ఫోన్‌లో ఉండే జీ 5 యాప్‌ను చూపెడతాడు. బస్సులో అంతా సంక్రాంతి సందడి నెలకొంటుంది. ఇంటికెళ్లగానే..భార్యతో మన శంకర వర ప్రసాద్‌గారు సినిమాలోని శశిరేఖ.. పాటను పాడతాడు. దానికి భార్య అతని హుషారు చూసి ‘ఏంటి బాస్ సంగతి’ అనగానే.. ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అంటూనే మన పండగకి మన ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలిగా అని అంటాడు. సరదాగా చిన్న పిల్లలతో ఆడుకుంటూనే మావయ్యలు, అత్తయ్యలను ఆట పట్టిస్తుంటాడు. అలాగే భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌ను చూపిస్తూ కుటుంబం అంతా కలిసి మన శంకర వర ప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇది మన పండగ..మన ఎంటర్టైన్మెంట్..మన తెలుగులో జీ5 అంటాడు మనోజ్, దీంతో జీ 5లో మన శంకర వర ప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు కూడా రాబోతున్నాయని హింట్ ఇచ్చారు.