టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, ప్రొడ్యూసర్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా ఎక్కడైనా తన స్టైల్, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె, హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్ సోదరి అయిన మంచు లక్ష్మీ, సినిమాలకే కాకుండా సామాజిక సేవల్లోనూ చురుకుగా పాల్గొంటుంది. అమెరికాలో చదువుకున్న మంచు లక్ష్మీ, తన కెరీర్‌ని హాలీవుడ్‌లో చిన్న పాత్రలతో ప్రారంభించింది. తర్వాత తెలుగు సినిమాల్లో అడుగు పెట్టి అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, చంద్రలేఖ, కుక్కూన్ వంటి విభిన్న చిత్రాల్లో నటించింది. నటనలో ప్రయోగాలు చేయడానికి, కొత్త పాత్రలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
Also Read : CILECT : అంతర్జాతీయ వేదికపై అమల అక్కినేని – అన్నపూర్ణ కాలేజ్‌కి గ్లోబల్ గుర్తింపు!
సినిమాలతో పాటు ఆమె “లక్ష్మీ టాక్స్”, “కమల హాసన్‌తో నేను” వంటి టాక్ షోల్లో హోస్ట్‌గా కూడా విశేష గుర్తింపు పొందింది. తన స్పష్టమైన అభిప్రాయాలు, ఫన్నీ ప్రెజెంటేషన్, రియల్ అటిట్యూడ్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. మంచు లక్ష్మీ సినిమాల పట్ల ఉన్న అభిరుచి, మహిళా శక్తి పట్ల ఉన్న నమ్మకం, సామాజిక సేవ పట్ల ఉన్న తపన ఇవన్నీ కలిపి ఆమెకు ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలబెట్టాయి. అయితే సినిమాల పరంగా నటించినప్పటికీ గట్టి హిట్ మాత్రం కొట్టలేకపోయింది. తాజాగా ఈ విషయం గురించి ఎన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వూలో పంచుకుంది.. ‘నేను సవాల్ గా తీసుకుని చేసిన సినిమా గుండెల్లో గోదారి. చాలా లాస్ అయ్యాను . మూవీ ఒక హోప్ తోనే చేస్తారు కానీ అది అనుకున్నట్టుగా జరగలేదు. నేను దాని కారణంగా చాలా నష్టపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.