ఆ రోజు నుండీ ఆహాలో ‘మంచి రోజులు….’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంతోశ్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్స్… ఇలా అన్నీ ఎలిమెంట్స్ ను కలగలిపి మారుతీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ కథ గురించి నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, ”పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులైన సంతోశ్, పద్మ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఇండియాలో పాండమిక్ సిట్యుయేషన్ మొదలవుతుంది. ఆ కారణంగా వారిద్దరూ స్వస్థలం హైదరాబాద్ చేరుకుంటారు. పద్మ తండ్రి గోపాలంకు తన కూతురంటే అమితమైన ప్రేమ. తన కూతురు మరో అబ్బాయితో ప్రేమలో ఉందనే విషయం గోపాలంకు తెలుస్తుంది. దాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. సాధారణంగా గోపాలం భయస్థుడు. దాన్ని అలుసుగా తీసుకుని చుట్టూ ఉన్న వారి చిన్న చిన్న విషయాలకే ఆయన్ని భయపెడుతుంటారు.
Read Also : రాజ్ కుంద్రాకు షాక్… మళ్ళీ పెరుగుతున్న కష్టాలు
Also Read
ఆ కారణంగా ఆయనలో భయం ఇంకా పెరుగుతుందే కానీ, తగ్గదు. అలాంటి భయంతో కూతురి ప్రేమను ఆయన ఒప్పుకోడు. సంతోశ్ కంటే మంచి సంబంధం తీసుకొచ్చి కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో గోపాలం తనలోని భయాలను ఎలా అధిగమిస్తాడు? గోపాలం ఫ్యామిలీకి సంతోశ్ ఎలా సపోర్ట్‌గా నిలుస్తాడు? సంతోశ్, పద్మ ప్రేమను గోపాలం అర్థం చేసుకుంటాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘మంచి రోజులు వచ్చాయి” అని అన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 3న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అజయ్ ఘోష్, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, ప్రవీణ్ వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!