రాజ్ కుంద్రాకు షాక్… మళ్ళీ పెరుగుతున్న కష్టాలు

అశ్లీల చిత్రాలను రూపొందించడం ఇబ్బందులను కొనితెచ్చుకున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు మళ్ళీ కష్టాలు పెరుగుతున్నాయి. పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా తిరస్కరించింది. తన నిర్మాణ సంస్థ రూపొందించిన వీడియోలు ‘శృంగారభరితమైనవి’ మాత్రమేనని, అయితే వాటిని పోర్న్‌గా పరిగణించరాదని రాజ్ కోర్టుకు తెలిపారు. అయితే ఆయన వాదనను కోర్టు అంగీకరించలేదు. రాజ్ కుంద్రాతో పాటు నటి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా సహా మొత్తం 6 మంది ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Read Also : టాప్ యాంగిల్ సెల్ఫీతో టాప్ లేపిన ‘రత్తాలు’

రాజ్ కుంద్రా ఇంతకు ముందు ఈ ఏడాది జూలైలో పోర్న్ ఫిల్మ్ కేసులో అరెస్టయ్యాడు. దీనిని ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారించింది. ఈ విషయమై బాంబే హైకోర్టుకు రాజ్ కుంద్రా సమాధానమిస్తూ.. వీడియోలు శృంగారభరితంగా ఉంటాయి కానీ లైంగిక కార్యకలాపాలను చూపించవని అన్నారు. ముంబై పోలీసుల సైబర్ సెల్‌లో నమోదైన పోర్న్ రాకెట్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా… ఐటీ చట్టంలోని సెక్షన్లు 67, 67(ఏ) భారతదేశంలో వర్తించవని కోర్టుకు తెలిపారు. రాజ్ కుంద్రా తరఫు న్యాయవాదులు అది ప్రశాంత్ పి పాటిల్, స్వప్నిల్ అంబురేలు కోర్టులో సమర్పించిన పత్రాల్లో వ్యాపారవేత్తపై ఉన్న ఏకైక అభియోగం కేసులో సహ నిందితులుగా ఉన్న నటీనటులు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేల వ్యక్తిగత వీడియోలకు సంబంధించినది అని పేర్కొన్నారు. షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలకు కంపెనీ యాప్‌ను మాత్రమే అందించిందని, అయితే ఇద్దరు నటీమణులకు ఆ వ్యక్తిగత ఓటిటి యాప్‌లో ప్రసారం, పంపిణీపై పూర్తి నియంత్రణ ఉందని రాజ్ న్యాయవాది చెప్పారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌డబ్ల్యూ సాంబ్రే చట్టపరమైన చర్యలను నివారించడానికి లేదా అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఈ నిందితులందరికీ మధ్యంతర రక్షణను 4 వారాల పాటు పొడిగించారు. ఈ కేసులో ఆయనకు సెప్టెంబర్‌లో బెయిల్ వచ్చింది.

Read Also : దూకుడుగా ఉన్న “లైగర్”… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు

‘హాట్‌షాట్స్’ అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించి అశ్లీల చిత్రాలను నిర్మించి పంపిణీ చేసినందుకు రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ జూలై 19న అరెస్టు చేసింది. కుంద్రాపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 420 (చీటింగ్), 34 (సాధారణ ఉద్దేశం), 292 మరియు 293 (అశ్లీల ప్రకటనలు, ప్రదర్శనలకు సంబంధించినది) ఐటి చట్టంతో పాటు మహిళల అసభ్య ప్రాతినిధ్యం కింద కేసు నమోదు చేశారు. ముంబై పోలీసులు అతనిపై చార్జిషీట్ దాఖలు చేయడంతో సెప్టెంబర్‌లో కుంద్రాకు బెయిల్ మంజూరైంది.

Related Articles

Latest Articles