తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో పాటుగా కమర్శియల్ యాడ్ లను కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. ఆయన ఖాతాలో ఎన్నో బ్రాండ్ లు ఉన్నాయి.. ఇటీవల ఫోన్ పే స్పీకర్లకు తన వాయిస్ ను అందించారు.. ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్‌లకు చేసిన డిజిటల్ చెల్లింపుల కోసం వాయిస్‌ని అందించిన మొదటి సౌత్ ఇండియన్ సెలబ్రిటీగా మహేష్ బాబు నిలిచారు. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు సూపర్ స్టార్లు నడుస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఫోన్ పే చెల్లింపుల కోసం తమ వాయిస్‌ను ఇస్తున్నట్లు సమాచారం.
ఐదు సెకన్లు వినిపించే మహేష్ బాబు వాయిస్ కు దాదాపు 5 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.. అయితే ఇప్పుడు మమ్ముట్టి, కిచ్చా సుదీప్ కూడా దాదాపు అదే రేంజ్‌లో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇప్పటికే ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లలో మహేశ్ వాయిస్ వినిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అమితాబ్ బచ్చన్ మహేశ్ కంటే ముందే ఫోన్ పేకి ఇలా వాయిస్ ఇచ్చారు..
ఇక మమ్ముట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇటీవల మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.50 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో మమ్ముట్టిన నటనకి ఆడియన్స్, విమర్శకులు ఫిదా అయిపోయారు.. ఈ సినిమాకు అవార్డులు రావడం పక్కా అంటూ ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు..