పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం రూపొందింది. ఇప్పటికే బయటకి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ శాకుంతలం సినిమాపై అంచనాలని పెంచాయి. లేటెస్ట్ గా శాకుంతలం సినిమా నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో ‘మల్లిక’ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు, అప్పుడే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ‘మల్లిక’ సాంగ్ ఫుల్ వీడియో మరింత ఆకట్టుకుంది. సాంగ్ లోని విజువల్స్, గుణశేఖర్ మ్యాజిక్, సమంతా గ్లామర్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సమంతా అందం ప్రతి ఒక్కరినీ కట్టి పడేసేలా ఉంది.
యుట్యూబ్ కే ఇలా ఉంటే వెండితెరపై చూసే సమయంలో మల్లిక సాంగ్ కి ఫాన్స్ మెస్మరైజ్ అవ్వడం గ్యారెంటీ. నిమిషమున్నర నిడివి మాత్రామే ఉన్న ఈ వీడియో సాంగ్ లో అనన్య నాగళ్ల, అదితి బాలన్ కూడా కనిపించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన హార్ట్ సూథింగ్ ట్యూన్ కి “మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక” అంటూ చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. రమ్య బెహరా అద్భుతమైన వాయిస్ మల్లికా సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన వాయిస్ మల్లిక సాంగ్ ని మరింత అందంగా మార్చింది. డెఫినెట్ గా మల్లికా మల్లికా సాంగ్ ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి, మరి ఆన్ స్క్రీన్ ఈ సాంగ్ చెయ్యబోయే మ్యాజిక్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి. మరి ఏప్రిల్ 14న శకుంతలగా సమంతా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ కొడుతుంది? రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ఎంత అగ్రెసివ్ గా చేస్తుంది అనేది చూడాలి.