బాలీవుడ్ లో ఒకప్పుడు హాట్ సెన్సేషన్ అయిన బ్యూటీ మల్లికా షెరావత్. వాస్తవానికి ఈ అమ్మడు ఉత్తరాది హీరోయిన్ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. సౌత్ లో ఆమె ఆరాధకులు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ తో పాటు అప్పట్లోనే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది మల్లికా. జాకీ చాన్ “ది మిత్” సినిమాలో మెరిసింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. అంతేకాదు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నేళ్లకు టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతోంది.
Read Also : “సర్కారు వారి పాట”లో కీర్తి సరిగమలు
లేడీ ఓరియెంటెడ్ త్రిభాషా చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టనుంది మల్లికా. “నాగమతి” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడికల్ హారర్ థ్రిల్లర్ గా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. నాగమతి కథ ప్రేక్షకులను 1900, 1947, 1990 మూడు కాలాల్లోకి తీసుకెళ్లబోతోంది. ఈ సినిమా ముహూర్త వేడుక ఇటీవల ముంబైలో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ మూవీకి అమ్రిష్ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.