టాలీవుడ్ చందమామగా కాజల్ ఎంతో మంచి గుర్తింపు పొందారు.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు..తాజాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని సమాచారం.. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషకం సంచలనం గా మారింది.. వరుస సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె కొంతకాలం పాటు సినిమాల కు బ్రేక్ ఇచ్చింది.
కాజల్ అగర్వాల్ రెండు సంవత్సరాల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్నారు.వీరి పెళ్లి అవడం అలాగే కాజల్ అగర్వాల్ తల్లి కావడంతో కొంత కాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. ఒక బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తిరిగి సినిమాలను ఒప్పుకుంటున్నారు..ఈ విధంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనుల లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తో పాటు బాలకృష్ణ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఈమె అఖిల్ దర్శకత్వంలో సత్యభామ అనే సినిమాలో నటిస్తున్నారు.. అయితే ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈ స్థాయి లో రెమ్యూనరేషన్ తీసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.