రెగ్యులర్ ఫార్మాట్ హీరోయిన్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తోంది మలయాళ కుట్టీ నివేదా థామస్. తెలుగులో చేసినవీ తక్కువ సినిమాలే అయినా గుర్తించిపోయే రోల్స్ చేసింది. నాని జెంటిల్ మెన్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన నివేదా నిన్నుకోరి, జై లవకుశతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. గ్లామర్ పాత్రలకు నో చెబుతూ కథ నచ్చితేనే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తూ యునిక్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది.
Also Read : NBK : వీరసింహ రెడ్డి సినిమా వెనుక ఇంత డ్రామా నడిచిందా
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, నాని లాంటి స్టార్లతో జోడీ కట్టింది నివేదా థామస్. కానీ శాకినీ డాకిని తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది. లాస్ట్ ఇయర్ 35 చిన్న కథ కాదు అంటూ ఓ సగటు మహిళ పాత్రలో మెస్మరైజ్ చేసేసింది బ్యూటీ. ఇద్దరు పిల్లలు తల్లిగా డీ గ్లామర్ పాత్రల్లో మెరిసింది. ఈ సినిమా వచ్చి దాదాపు 8 నెలలు కావొస్తున్నా కొత్త మూవీ ఎనౌన్స్ చేయలేదు. అయితే విజయ్ సేతుపతితో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కోసంఈ కేరళ కుట్టీని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అదేం లేడని పూరి టీం క్లారిటీ ఇచ్చింది. సో ప్రస్తుతం నివేదా చేతిలో సినిమాలేవీ లేవనే చెప్పాలి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటె 35 సినిమా కోసం బరువు పెరిగిన నివేదా ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉంది అందుకే సినిమాలు చేయట్లేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది.