లాస్ట్ ఇయర్ మహారాజాతో ఇటు ఇండియాలోనూ అటు చైనాలో బ్లాక్ బస్టర్ హిట్ చూసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆనందానికి అడ్డుకట్ట వేసింది విడుదల పార్ట్ 2. ఎన్నో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన ఈ బొమ్మ ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేయలేదు. జస్ట్ ఓ ఎక్స్ పరిమెంటల్ మూవీగా మిగిలిపోయింది. మహారాజాతో 50 సినిమాలను కంప్లీట్ చేసి ఓ మైల్ స్టోన్ దాటిన మక్కల్ సెల్వన్ నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.
Also Read : NANI : HIT 3 ట్రైలర్.. వెండితెర ఎరుపెక్కాలా.!
సినిమా లైనప్ విషయంలో ధనుష్‌ను ఫాలో అవుతున్నాడు విజయ్ సేతుపతి. మూడు సినిమాలు కంప్లీట్ అయ్యాయంటే మరో రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నాడు ధనుష్. అలాగే స్టార్ దర్శకులతో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు మక్కల్ సెల్వన్ ఇదే పంథాను అనుసరిస్తున్నాడు. ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఏస్, మిస్కిన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ట్రైన్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. ఈ రెండింటిలో రుక్మిణీ వసంత్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. అలాగే పేరు పెట్టని వీజేఎస్ 54 సినిమాకు కూడా గుమ్మడికాయ కొట్టేశారు. కానీ ఈ మూడు సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. ఎప్పుడో కంప్లీటైన పిశాసు2, సైలెంట్ మూవీ గాంధీ టాక్స్ విడుదలకు నోచుకోవడం లేదు. ఇలా పిక్చర్స్ కంప్లీటయ్యాయో లేదో కొత్త ప్రాజెక్టుల వేట షురూ చేస్తున్నాడు. ఇప్పుడు క్రేజీ దర్శకులను లైన్లో పెడుతున్నాడు సేతుపతి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఓకే చెప్పాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ దెబ్బకు తెలుగు హీరోలే పూరీతో వర్క్ చేసేందుకు ఆలోచనలో పడ్డ సమయంలో విజయ్ రిస్క్ చేసి డేరింగ్ స్టెప్ తీసుకున్నాడన్నది ప్రజెంట్ టాక్. అలాగే ఇప్పటి వరకు ప్లాపే చూడిన ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ వర్సటైల్ యాక్టర్. గరుడన్‌తో భారీ హిట్ అందుకున్న దొరై సెంథిల్ కుమార్ ప్రజెంట్ లెజెండ్ శరవణన్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత విజయ్ సినిమాకు షిఫ్ట్ కావొచ్చునన్నది టాక్. అంతలో పూరీ సినిమా కంప్లీట్ చేయాలన్నది మక్కల్ సెల్వన్ ప్లాన్. మరీ పూరీ అనుకున్న టైంకే సినిమానూ పూర్తి చేస్తాడో లేదో.