యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తు నిర్మిస్తున్నాడు. అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూడబోతున్నామని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో తెలిసింది.
న్యాచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. క్లాస్, మాస్ సినిమాలు చేస్తు వస్తున్న నాని ఈసారి వైలెన్స్‌కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. ట్రైలర్ లోని కొన్ని షాట్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ ప్రవచన కర్త శ్రీ చాగంటి గారితో వాయిస్ ఓవర్ అదిరింది. అర్జున్ సర్కార్‌గా నాని ఆటిట్యూడ్ పీక్స్ అనే చెప్పాలి. ఒకేలా వరుస హత్యలు జరుగుతుండడం ఆ కేసును అర్జున్ సర్కార్‌కు అప్పగించడం ఈ క్రమంలో ఆయన చేసిన వైలెన్స్ ఆ కేసును ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. ఓవరాల్ గా హిట్ 3 ట్రైలర్ మాత్రం సినిమా పై అంచనాలను పెంచేసేలా ఉంది. నాని ఈసారి తన ఫ్యాన్స్‌కు ఊరమాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ. సమ్మర్ కానుకగా మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.