Suriya 42: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ప్రైవసీ అన్న పదానికి అర్ధమే మారిపోయింది. ఒకప్పుడు సినిమా సెట్ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు తప్ప ఏమి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే సినిమా మొత్తం స్మార్ట్ ఫోన్లలో ఉంటుంది. సినిమా పూజా కార్యక్రమాలను మొదలుపట్టిన దగ్గరనుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఏదో ఒక లీక్ బయటకు వస్తూనే ఉంది. స్టార్ హీరోలకు మాత్రమే ఈ లీకుల బెడద ఎక్కువ అవుతోంది. మొన్నటికి మొన్న ప్రభాస్, తరువాత రామ్ చరణ్, ఇక తాజాగా బాలకృష్ణ ఇలా రోజుకో స్టార్ హీరో సెట్ నుంచి ఫోటో, వీడియో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది కాస్తా వైరల్ అయిపోవడంతో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఈ లీకులకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కోలీవుడ్ బడా నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే.
స్టూడియో గ్రీన్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. దాదాపు పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా కొన్నిరోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్లగా.. అప్పుడే సూర్య లుక్ అని, సూర్య ఫైట్ అని సోషల్ మీడియాలో లీక్ ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఇక వీటిపై స్టూడియో గ్రీన్ ఘాటుగానే స్పందించింది. ఇకపై అలా సెట్ లో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారికి జైలు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. “సూర్య42 నుంచి ఫోటోలు కానీ, వీడియోలు కానీ లీక్ చేయకండి. ఈ సినిమాలో మేము చేసే ప్రతి సీన్ కు మేము అందరం రక్తం చిందిస్తున్నాం. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడానికి కష్టపడుతున్నాం. ఇప్పటివరకు ఏమైనా ఫోటోలు, వీడియోలు కనుక నెట్ లో ఉంటే డిలీట్ చేసి మాకు సహాయం చేయండి. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకండి. ఇక ముందు ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదు. ఫోటోలు, వీడియోలు కనుక నెట్ లో కనిపిస్తే కేసు పెట్టి వారిని జైలుకు పంపిస్తాం”అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ చిత్రంలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Please Don't Share Any Shooting Spot Videos and Photos about #Suriya42 pic.twitter.com/idnGu4VXvz
— Studio Green (@StudioGreen2) September 25, 2022