అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, తన కెరీర్ కి ‘కస్టడీ’ సినిమా హ్యూజ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. చై అండ్ అక్కినేని ఫాన్స్ కూడా కస్టడీ సినిమాపై భారి అంచనాలు పెట్టుకున్నారు. నాగార్జున, అఖిల్ లు డిజప్పాయింట్ చెయ్యడంతో అక్కినేని అభిమానుల ఆశలన్నీ కస్టడీ సినిమాపైనే ఉన్నాయి. ఆ ఆశలని కస్టడీ సినిమా ప్రమోషనల్ కంటెంట్ రోజురోజుకీ పెంచుతూనే ఉంది. ప్రామిసింగ్ స్టఫ్ ని రిలీజ్ చేస్తూ కస్టడీ మేకర్స్ సినిమాపై హోప్స్ ని భారీగా పెంచుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు మార్క్ స్క్రీన్ ప్లే కస్టడీ సినిమాకి యాడెడ్ ఎస్సెట్ అయ్యేలా ఉంది. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ తో సహా ప్రమోషనల్ ఈవెంట్స్ ఆల్మోస్ అయిపోయాయి, ఇక మే 12న కస్టడీ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వడం మాత్రమే బాలన్స్ ఉంది. ఎలాంటి సినిమా కోసం అయితే అక్కినేని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారో, అంతకుమించి కస్టడీ ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కోలీవుడ్ మీడియా కూడా కస్టడీ సినిమాపై పాజిటివ్ న్యూస్ ని పబ్లిష్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికైతే ఈ సినిమా పై తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడులో కూడా పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఖచ్చితంగా చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డ్ ని బేస్ చేసుకోని చూస్తే, చై కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని కస్టడీ సినిమా చూసే ఛాన్స్ ఉంది. తమిళనాడులో వెంకట్ ప్రభునే కస్టడీ సినిమాకి ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ గా ఉన్నాడు, అందుకే ఈ సినిమా రిలీజ్ కి ముందే సీక్వెల్ కన్ఫామ్ చేసేశాడు వెంకట్ ప్రభు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పార్ట్ 2 ఉంటుందని చెప్పుకొచ్చాడు. గతంలో దిల్ రాజు ‘వారిసు’ మూవీ ఈవెంట్‌లో చెప్పిన పాలపులర్ డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తూ.. నాగచైతన్యతో వర్క్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. ప్రస్తుతం తాను ఇప్పుడు తెలుగులో అంతగా మాట్లాడలేనని.. కానీ కస్టడీ పార్ట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడతానని వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చేసాడు. దీంతో కస్టడీకి సీక్వెల్ ఉంటుందని కన్ఫామ్ చేసినట్లే. అంతేకాదు.. ఇప్పటికే ‘కస్టడీ 2’ కోసం రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కస్టడీ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ లెక్కన కస్టడీ పై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కస్టడీ సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. వెంటనే సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి కస్టడీ అండ్ కస్టడీ 2 ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మే ౧౨ వరకూ ఆగాల్సిందే.