అడివి శేష్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ “మేజర్”. 2008లో జరిగిన ముంబై దాడిలో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంకా నిర్మాణాంతర దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ నుంచి ఇటీవల అనారోగ్యం కారణంగా అడివి శేష్ విరామం తీసుకున్నాడు. తాజాగా సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా అడివి శేష్ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. “‘మేజర్’ సందీప్ ఉన్నికృష్ణన్ గా దాదాపుగా నా ప్రయాణం పూర్తయింది. ఈ షెడ్యూల్ తర్వాత నేను అతని ఆరాధకుడిగా తిరిగి వెళ్తాను. అతన్ని బాగా అర్థం చేసుకునే అభిమాని. తనలోని మేజర్ సందీప్ భాగాన్ని వెతకడానికి ప్రయత్నించిన అభిమాని. #మేజర్ ది ఫిల్మ్” అంటూ శేష్ ట్వీట్ చేశాడు.
Read Also : రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!
కాగా ఈ సినిమా రచయితలలో శేష్ కూడా ఒకరు. స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తున్న సమయంలో ఆయన సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను వ్యక్తిగతంగా కలిశాడు. శేష్ ఈ ప్రాజెక్ట్‌తో మానసికంగా అటాచ్ అయినట్టు గతంలో కూడా పేర్కొన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఏ+ఎస్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించాయి. ఈ చిత్రం చిత్రీకరణ తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి జరుగుతోంది. మలయాళంలోకి డబ్ చేయనున్నారు. త్వరలోనే సినిమా నుంచి అప్డేట్స్ ను ప్రకటించనున్నారు మేకర్స్.
My journey being #MajorSandeepUnnikrishnan is almost finished. After this schedule, I shall go back to being his admirer. A fan that understands him better. A fan that tried to find a piece of Major Sandeep within himself. #MajorTheFilm pic.twitter.com/QMQ7MvWpD0
— Adivi Sesh (@AdiviSesh) October 23, 2021