రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!

పాన్ పాండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలైంది. “నా పేరు విక్రమాదిత్య. నాకు అన్నీ తెలుసు కానీ మీకు ఏమీ చెప్పను. నేను మీలో ఒకడిని కాదు. అలాగని దేవుడిని కాదు” అంటూ ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ ఉత్కంఠభరితంగా ఉంది. ప్రభాస్ లుక్, టీజర్ లోని సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తున్నాయి. అందులో టవర్ కూలిపోవడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే సినిమా విషాదాంతంగా ముగియనుందా ? అనే డౌట్ వస్తోంది. ఏదేమైనా చాలాకాలం నుంచి ఈ టీజర్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు మాత్రం “రాధేశ్యామ్” టీజర్ మంచి ట్రీట్ ను ఇచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే విక్రమాదిత్య ఎవరు ? అనే విషయాన్నీ ప్రపంచానికి ‘రాధే శ్యామ్’ టీజర్ తో తెలియజేశారు.

Read Also : ‘జై భీమ్’ ట్రైలర్ లో లాయర్ గా అదరగొట్టిన సూర్య!

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం 2022 జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ ఇటలీ నేపథ్యంలో రూపొందింది. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

Related Articles

Latest Articles