26/11 Mumbai Attack: 26/11 ముంబై దాడులను ఈ దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడి జరిగి నేటికి 17 ఏళ్లు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 175 మంది మరణించారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' మూవీని తెరకెక్కించిన అడివి శేష్ ను మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా చక్కని ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
Adivi Sesh New Movie Major Updates. అడివి శేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 సంఘటనలో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మార్చి 15 మేజర్ సందీప్ 45వ జయంతి సందర్భంగా అతని బాల్య స్మృతులను, శిక్షణా రోజులను, తల్లిదండ్రులతో, సోదరితో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తూ ఓ వీడియోను ‘మేజర్’ చిత్ర బృందం రూపొందించి విడుదల చేసింది. సందీప్ జీవితంలోని…
Major అనే ఆసక్తికరమైన సినిమాతో ప్రామిసింగ్ యాక్టర్ అడివి శేష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటించారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనాతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం…
యంగ్ హీరో అడవి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషించాడు. విషాదకరమైన 26/11 ముంబై దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో తన ప్రాణాలను కోల్పోయిన అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ ను స్మరించుకుంటూ ఆయన తల్లిదండ్రులు కె ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ సమక్షంలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈరోజు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ప్రియమైన…
అడివి శేష్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ “మేజర్”. 2008లో జరిగిన ముంబై దాడిలో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంకా నిర్మాణాంతర దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ నుంచి ఇటీవల అనారోగ్యం కారణంగా అడివి శేష్ విరామం తీసుకున్నాడు. తాజాగా సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా అడివి శేష్ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. “‘మేజర్’ సందీప్…