Major: సినిమా చూసి థియేటర్లోనే ఏడ్చేసిన ప్రేక్షకులు.. ‘మేజర్’ అమర్ రహే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలోశశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”మేజర్”. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో తెలుగుతో పాటు మలయాళ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. 2008 నవంబర్ లో ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ప్రస్తుతం మరోసారి సినిమా ద్వారా సంచలనం సృష్టిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక ఈ నేపథ్యంలోనే పలువురు యుద్ధ వీరులకు సినిమాను స్పెషల్ స్క్రీనింగ్స్ వేసి చూపించారు. ఇక సరికొత్తగా ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ని కండక్ట్ చేయడం మొదలు పెట్టింది.
తాజాగా ఈ మూవీ ప్రీ స్క్రీనింగ్ జైపూర్ లో జరిగింది. అక్కడ ‘మేజర్’ మూవీకి భారీ ఆదరణ లభించింది. ఆ వీడియోను శేష్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఆ వీడియోలో మేజర్ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకోవడం గమనార్హం. ముఖ్యం తన పాపతో అచ్చిన ఒక మహిళ ఉన్ని కృష్ణన్ మరణాన్ని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడవడం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఇక సినిమా అయిపోయినా తరువాత ప్రతి ఒక్కరు లేచి దేశ రక్షణ కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులని చూసి అమర్ రహే అంటూ నినాదాలు చేయడం గర్వించదగ్గ విషయం. ” ప్రేక్షకులు జైపూర్ లో ఈ మూవీని చూస్తూ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహే అంటూ నినాదాలు చేయడం చూశాను. ఇది నా జీవితంలో మాసీవ్ మూవ్ మెంట్”అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
- Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
- Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
#Jaipur First time we saw people in the theater scream along with the film. #MajorSandeepUnnukrishnan AMAR RAHE! Massive moment in my career. Watch this! #MajorOnJune3rd pic.twitter.com/5W81GHm6jX
— Adivi Sesh (@AdiviSesh) May 28, 2022
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!