సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా చిత్ర ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మీడియాతో తన ఇంటరాక్షన్‌లో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.
“సర్కారు వారి పాట” ఎలాంటి సినిమా?
పరశురామ్ గత సినిమాలు ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. SVP అనేది యాక్షన్, మాస్ సినిమా. ఇది గీత గోవిందం, పోకిరి కలయిక. ఈ చిత్రంలో చాలా మందికి కనెక్ట్ అయ్యే బలమైన సందేశం ఉంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగితే, సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతుంది.
రషెస్ చూసినప్పుడు మీకు ఏం అనిపించింది?
నేను మొదట రషెస్ చూసినప్పుడు హీరో క్యారెక్టరైజేషన్, మాస్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇది పోకిరితో పోలిస్తే నెక్స్ట్ లెవెల్ అనిపించింది.
మహేష్ బాబుతో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు?
ఎడిటర్ చంటి గారికి ఫ్రాక్చర్ కారణంగా, నేను మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడులో కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయాల్సి వచ్చింది. టక్కరి దొంగ, పోకిరి, SVSC వంటి సినిమాలు చేసాను. నేను ఇప్పటివరకు దాదాపు 500 సినిమాలను ఎడిట్ చేశాను.
Read Also : Pisachi-2 Teaser : నగ్నంగా కనిపించిన స్టార్ హీరోయిన్.. ?
రీల్, డిజిటల్ యుగంలో మీరు ఎలాంటి మార్పులను చూశారు?
రీల్ ఉన్నప్పుడు పని చాలా కఠినంగా ఉండేది. ఒకప్పుడు సినిమాను ఎడిట్ చేయడానికి చాలా సమయం పట్టేది. కాబట్టి అప్పటి ఎడిటర్స్ పై విపరీతమైన గౌరవం ఉండేది. ఇప్పుడు ఎడిటింగ్ సులువైంది.
పరశురామ్‌తో వర్క్ ఎలా ఉంది?
పరశురామ్ మంచి రచయిత. కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటాడు.
మీరు మొదట కథ ఎప్పుడు విన్నారు?
బుజ్జి (పరశురామ్) నా ఫీడ్‌బ్యాక్ కోసం గీత గోవిందం చిత్రీకరణ సమయంలో నాకు కథను చెప్పారు. సాధారణంగా నేను కథలు విన్న తర్వాత లేదా ఎడిటింగ్ సమయంలో దర్శకులకు కొన్ని ఇన్‌పుట్‌లు ఇస్తాను. కానీ “సర్కారు వారి పాట”కు అలా జరగలేదు. ఇప్పుడు ఈ సినిమా అవుట్ ఫుట్ పై చిత్ర యూనిట్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.
సినిమాలో లీడ్ పెయిర్ రొమాంటిక్ ట్రాక్, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?
హీరో-హీరోయిన్ ట్రాక్ బాగా వచ్చింది. నేను ఆ పోర్షన్‌లను చాలా ఎంజాయ్ చేశాను. ట్రాక్ నిజంగానే నవ్వులు పూయించింది. మహేష్ బాబు అభిమానులకు ఎస్వీపీ పండుగలా ఉంటుంది. ఈ మూవీ అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది. మహేష్ ను ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో చూడబోతున్నారు. అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు మూవీ నచ్చుతుంది.
మీ తదుపరి ప్రాజెక్ట్‌లు ఏమిటి?
భోళా శంకర్, గాడ్ ఫాదర్, యశోద చేస్తున్నాను.