సూపర్ స్టార్ మహేష్ బాబు ను చూడగానే.. అందదు అనుకొనే ఒక మాట .. హాలీవుడ్ హీరోలా ఉన్నాడురా అని. ఇక అమ్మాయిల మనసును కొల్లగొట్టడంలో మహేష్ తర్వాతే ఎవరైనా.. మహేష్ అందం ఎవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ గా ఉంది అంటే అతిశయోక్తి కాదు. సర్కారువారి పాట ట్రైలర్ లో చెప్పినట్లు ‘మీకు అప్పుడే పెళ్లి ఏంటి అండి .. ఇంకా చిన్న పిల్లాడు అయితే..’ నిజం చెప్పాలంటే మహేష్ ఛార్మింగ్ లుక్ చూస్తే ఎవ్వరికైనా ఇదే మాట అనాలనిపిస్తోంది. ప్రతి సినిమా సినిమాకు మహేష్ లుక్ మారిపోతూ ఉంటుంది. ‘సర్కారువారి పాట’ సినిమాలో మహేష్ లుక్ అప్పుడెప్పుడో వచ్చిన పోకిరిని గుర్తుచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 46 ఏళ్లలోనూ ఇంకా 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు అంటే ఆయన అందం వెనుక సీక్రెట్ ఏంటి..? అనేది అందరికి అంతుచిక్కని మిస్టరీనే.. ఇక ఈ మిస్టరీని ఛేదించారు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్.
ప్రస్తుతం మహేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ మే 12 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం విదితమే . తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్- లక్ష్మణ్ మహేష్ ఛార్మింగ్ లుక్ సీక్రెట్ ను లీక్ చేశారు. “మహేష్ ఇంత అందంగా, కూల్ గా, ఛార్మింగ్ గా కనిపించడానికి కారణం ప్రతి రోజు ధ్యానం చేయడమే. ఆయన రోజూ మూన్ ధ్యానం చేస్తారు. ఈ ధ్యానం వలన ఆయన చాలా కూల్ గా కనిపిస్తారు. మూన్ ధ్యానం చేస్తూ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు. ఇక ఆ ట్రాన్స్ లో తన శరీరాన్ని, మనసును తన ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఇలా చేసేవారికి నిత్యా యవ్వనం ప్రాప్తిస్తుందని” తెలిపారు. అయితే ఇలా చేయడం కొంచెం కష్టమని, ఈ మూన్ ధ్యానం ను సుదీర్ఘ కాలంగా చేయడం వలన మహేష్ ఇంత ఛార్మింగ్ గా ఉన్నారని తెలిపారు. ఇక మహేష్ యోగాతో పాటు జిమ్ లో వర్క్ అవుట్స్, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన అందంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక ‘సర్కారు వారి పాట’ తరువాత మహేష్ ఇంకెన్ని లుక్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.