మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇన్ని రోజులు ఈగర్ గా వెయిట్ చేసిన ఘట్టమనేని అభిమానులకి సంక్రాంతి గిఫ్ట్ ని కొంచెం లేట్ గా ఇస్తూ “హారికా హాసిని” ప్రొడ్యూసర్స్ SSMB 28 షూటింగ్ ని రేపు స్టార్ట్ చెయ్యనున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేశారు కానీ అది సినిమాలో ఉంటుందో లేదో అనే విషయంలో ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ గతంలో జరిగిన షూటింగ్ పార్ట్ ని తీసేస్తే, రేపు జరగబోయేదే SSMB 28 ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది. స్టంట్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చెయ్యనున్న భారి ఫైట్ తో ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు జరగనుందని సమాచారం.
చాలా రోజులుగా మహేశ్ ఫాన్స్ ని ఊరిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటైల్స్ ఇచ్చేశాడు నాగ వంశీ. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ని జనవరి 18 నుంచి మొదలుపెట్టనున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇందులో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అనే నంబర్స్ ఏమీ వేసుకోలేదు. మహేశ్ బాబు పక్కన ఇద్దరు హీరోయిన్స్ అంతే, సోషల్ మీడియాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ అని రాస్తున్నారు అది తప్పు అని నాగ వంశీ క్లారిటీ ఇచ్చేశాడు. SSMB టైటిల్ ఇంకా పెట్టలేదు కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ని మాత్రం ఫిక్స్ అయ్యాం. ఆగస్ట్ 11న SSMB 28 ఆడియన్స్ ముందుకి వస్తుంది అనే కన్ఫాం చేశాడు నాగ వంశీ.